విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌


Sun,June 16, 2019 03:25 AM

-వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-జేఈఈ మెయిన్స్‌లో 4వ ర్యాంకు సాధించిన విద్యార్థికి సన్మానం
వనపర్తి, నమస్తే తెలంగాణ : నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థి దశ నుంచే విద్యా రంగంలో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్‌ను సాధించుకోవచ్చునని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రానికి చెందిన అశోక్‌రెడ్డి, ఇందిరమ్మ దంపతుల కుమారుడు జిల్లెల ఆకాష్‌రెడ్డి ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌లో అఖిల భారత స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. దీంతో మంత్రి నిరంజన్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని వారి నివాసగృహానికి వెళ్లి విద్యార్థిని అభినందించి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అఖిల భారత స్థాయిలో 4వ ర్యాంకుతో పాటు తెలంగాణలో మొదటి ర్యాంకును సాధించడంతో వనపర్తి జిల్లా పేరు రాష్ట్రంలోనే ముందజలో ఉందన్నారు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి విద్యార్థి ఆకాష్‌ రెడ్డిని ఆశ్వీరదించారు. ఈ కార్యక్రమంలో రేవల్లి జెడ్పీటీసీ భీమయ్య, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...