రిజర్వాయర్‌గా గణపసముద్రం


Sat,June 15, 2019 12:35 AM

ఖిల్లాఘణపురం : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తు ముందుకుసాగుతుంది. కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువుల పూడికతీత కు మిషన్ కాకతీయను ప్రవేశపెట్టింది. దీనిద్వారా నీటి నిల్వ సామార్థ్యం పెరిగి రైతుల పంటల చివరి దశ వరకు సాగునీరు అందుతుంది. అందులో భాగంగా వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గతంలో కరువు మండలంగా ఉన్న ఖిల్లాఘణపురం, పెద్దమందడి మం డలాలకు ఎలాగైన సాగునీరు తేవాలనే పట్టుదలతో ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మండలానికి సాగునీరు తీసుకువచ్చి రైతన్నల కళ్లలో సంతోషాన్ని నింపా డు. ప్రతి గ్రామ చెరువుకు కృష్ణమ్మ నీటిని తీసుకురావ డం జరిగింది. 30 ఏండ్లకు ముందు నిండిన గణపురం సముద్రం మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో కృష్ణమ్మ నీటితో నిండి అటుగుపారింది. అందుకు మండల ప్రజ ల సంతోషం అంతా ఇంతా కాదు. మరో అడుగు ముం దుకు వేసి గణపసముద్రాన్ని రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ రిజర్వాయర్ పూర్తయివే 25వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వనపర్తి నియోజకవర్గంలో రైతన్నలు సంతోషంగా పంటలను వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలను పరిశీలిస్తు సాగునీటిని చెరువులకు నింపుతున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మండల కేంద్రంలోని గణప సముద్రంను రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్‌ఈ భద్రయ్య గణపసముద్రాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఘణపురం బ్రాంచ్ కెనాల్ పనులతో పాటు గణపసముద్రం క ట్ట పరిశీలన, నీటిని నిల్వ చేస్తే జరిగే పరిణామాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మండలంలోని షాపూర్, మానాజీపేట, ఉప్పర్‌పల్లి, అడ్డాకల్ మండలాలకు సాగునీరు అందించేందుకు ఘణపు రం బ్రాంచ్‌కెనాల్ పనులను పరిశీలించి అక్కడ ఉన్న గుత్తెందారులతో కూడా పనులను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశా రు.

వచ్చే సీజన్ నాటికి స్టక్చర్ పనులను పూర్తిచేసి మిగిలిపోయిన గ్రామాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. గణపసముద్రం రిజర్వాయర్‌గా మార్చేందుకు ఇప్పటికే సర్వే పనులు పూర్తిచేశామని, గణపసముద్రాన్ని రిజర్వాయర్‌గా మారిస్తే నీటి నిల్వ శాతం ఎంతదూరం ఉం టుందనే దానిపై కూడా చర్చించినట్లు ఎస్‌ఈ తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. గణపసముద్రంను రిజర్వాయర్‌గా మార్చడంతో పాటు కట్ట వెడల్పును చేసి రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈలు రమేష్‌జాదవ్, సంజీవరావు, డీఈ సత్యనారాయణగౌడ్, సర్వే ఇంజినీరు బాలగురువయ్య, విక్రమ్ ఉన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...