ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలల సీజ్


Sat,June 15, 2019 12:35 AM

కొత్తకోట : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలను సీజ్ చేసినట్లు ఎంఈవో కృష్ణ య్య తెలిపారు. మండల కేంద్రంలోని ఎంఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, టీవీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలలను సందర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేఖంగా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులను అక్రమంగా విక్రయిస్తుండడంతో ఎంఈవో కృష్ణయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులతో ఎంఈవో కలిసి ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేశారు. అందులో పద్మాలయ పీపూల్స్, నివేదిత పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేఖంగా వ్యవహరిస్తుండడం పట్ల ఆ రెం డు పాఠశాలలను సీజ్ చేసినట్లు ఎంఈవో తెలిపా రు. విద్యార్థి సంఘాల నాయకులు రాము, గణేష్, అరవింద్‌నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేఖంగా ఉన్న పాఠశాలలపై అధికారు లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైన ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకొని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డీఈవోను కోరుతున్నట్లు వారు చెప్పారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...