డిగ్రీ అడ్మిషన్‌కు నేడే చివరి తేదీ


Sat,June 15, 2019 12:35 AM

వనపర్తి విద్యావిభాగం : డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు నేడే చివరి తేదీ అని వనపర్తి జిల్లా దోస్త్ కన్వీనర్ నరసింహరావు తెలిపారు. శుక్రవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ మే 22 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించామని, జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు కళాశాలలో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ అడ్మిషన్లు పొందేందుకు శనివారం చివరి రోజు అని అందుకు సీట్ అలాట్‌మెంట్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఆన్‌లైన్‌లో కళాశాలలో చేరుతున్నట్లు ఓకే చేయాలని పేర్కొన్నారు. జూలై 1న కళాశాలలో ధ్రువపత్రాలను అందజేయాలని ఆయన సూచించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...