బడీడు పిల్లలు బడిలోనే ఉండాలి


Sat,June 15, 2019 12:35 AM

వనపర్తి రూరల్ : మండలంలోని పలు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. మండలంలోని పెద్దగూడెం ఉన్నత, ప్రాథమిక పాఠశాల, కడుకుంట్ల గ్రామంలో సర్పంచ్ హరిత, చిట్యాల బడిబాట కార్యక్రమంలో సర్పంచ్ పుల్లజీన్, చిట్యాల గ్రామంలో సర్పంచ్ భానుప్రకాష్‌రావు, అంకూర్ గ్రామంలో సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డిలు బడిబాట ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడీడు పిల్లలందరూ ప్రభుత్వ బడిల్లోనే ఉండాలని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకోసం ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులను కల్పిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలాను చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..
గోపాల్‌పేట : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా శుక్రవారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులచే ఆయా గ్రామాల్లో బడిబాటపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ ప్రైవేటు పాఠశాల వద్దు-ప్రభుత్వ పాఠశాల ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులచే బస్టాండ్ వరకు బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ అవరణలో గ్రామస్తులనుద్దేశించి ప్రధానోపాధ్యాయులు రమాకాంత్ మాట్లాడుతూ విద్యర్థులకు నాణ్యమైన విద్య నందించడంకోసం ప్రభుత్వం సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యారికి ప్రభుత్వం నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లో తమ తమ పిల్లలను చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సురేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పెద్దమందడిలో..
పెద్దమందడి : మండల కేంద్రంతో పాటు మండలంలో అంగన్‌వాడీలో పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎంఈవో శంకర్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని బలిజపల్లి గ్రామంలో బడిబాట ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు తదితర మౌలిక వసతులను కల్పిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని మంగంపల్లి గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో సర్పంచ్ శారద పాల్గొని గ్రామస్తులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

పెబ్బేరులో..
పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలంలో జనుంపల్లి, పాతపల్లి తదితర గ్రామాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనుంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ రాజవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సత్యారెడ్డి, గ్రామ నాయకుడు రాధాకృష్ణలు విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను, దుస్తులను పంపిణీ చేశారు. పాతపల్లి బడిబాటలో మండల విద్యాధికారి జయరాములు, సర్పంచ్ రవీందర్‌నాయుడు పాల్గొని ఇంటింటికీ తిరిగి చదువు ఆవశ్యకతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రేవల్లిలో..
రేవల్లి : మండలంలోని ఆయా గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్పునూ ర్ గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్, రేవల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్రాచారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయా గ్రామాలలో వీధులలో బడిబాట ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, సలీం, కృష్ణ య్య, శ్రీను, గోవిందు, రాములు, బాలరాజు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...