రైతులకు సబ్సిడీపై విత్తనాలు సిద్ధం


Sat,June 15, 2019 12:34 AM

గోపాల్‌పేట : వానాకాలం పంట సాగు చేసుకునే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు స్థానిక సింగిల్ విండో గోదాంలో సిద్ధంగా ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి నరేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జీరాక్స్‌తో దరఖాస్తు చేసుకొని వారికి కావలసిన విత్తనాలను సబ్సిడీపై పొందవచ్చన్నారు. 25కేజీల బస్తా బీపీటీ-5204 రకం వరి విత్తనాలు సబ్సిడీ పోను రూ.634.50, 25కేజీల బస్తా ఆర్‌ఎన్‌ఆర్-15048 రకం రూ.509.50, 30కేజీల బస్తా ఎంటీయూ 1010రకం రూ.720గా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి తో పాటు మొక్కజొన్నలు, కందులు, కొర్రలు, రాగులు, పచ్చజొన్నలు అందుబాటులో ఉన్నట్లు ఏవో తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...