ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి


Sat,June 15, 2019 12:34 AM

-ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంవీఐకి వినతి
వనపర్తి వైద్యం : జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల, కళాశాలల బస్సులు నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న యాజమానులపై కఠిన చర్యలు తీసుకొని, బస్సులను సీజ్ చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మోటర్ వెకిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్‌కు శుక్రవా రం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో సుమారు 50కిపైగా స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయని, ఇందులో 95 శా తం బస్సులకు ఫిట్‌నెస్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్నాయని అలాంటి బస్సులను సీజ్ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మండ్లరాజు, నాయకులు అజయ్, నవీన్, ప్రవీణ్, వెంకటేష్, లక్ష్మ ణ్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...