వైద్యులపై దాడి తగదు


Sat,June 15, 2019 12:34 AM

-ఆర్‌ఎంవో చైతన్య గౌడ్
వనపర్తి వైద్యం : జూనియర్ వైద్యులపై దాడి చేయడం తగదని ఆర్‌ఎంవో చైతన్యగౌడ్ అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని ప్రభు త్వ దవాఖాన ఓపీ సేవలను ఆరగంట పాటు నిలిపి వేసి దవాఖాన ముందు నల్ల బ్యాడ్జీలతో వైద్యులు నిరసన తెలిపి సూపరింటెండెంట్ సురేష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎంవో మాట్లాడుతూ ఈనెల 13న కోల్‌కత్తా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ డాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వనపర్తి ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు హరిష్‌సాగర్, రాము, రాజ్‌కుమార్, పల్లవి, రాజ్యలక్ష్మి, శ్రీనివాసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...