హరితహారంపై గ్రామసభలు


Sat,June 15, 2019 12:33 AM

పెద్దమందడి : మండలంలోని పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి, చికర్‌చెట్టుతండా, చిన్నమందడి తదితర గ్రామాలలో హరితహారం కార్యక్రమంపై సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు సిద్దయ్య, వరలక్ష్మీ, రాధకృష్ణనాయక్‌లు మాట్లాడుతూ గ్రామాలకు నిర్దేశించిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన హరితహారం కార్యక్రమం గొప్పదని, రాష్ట్రంలో అటవీ శాతం తక్కువ ఉన్నందున నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారని, అందరం కలిసికట్టుగా హరితహారంలో మొక్కలను నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, వీఆర్‌వోలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...