బాధితుల ఇంటికొచ్చిన సీఎం సహాయ నిధి చెక్కులు


Sat,June 15, 2019 12:33 AM

- పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, నమస్తే తెలంగాణ : అనారోగ్య బారిన పడి మెరుగైన చికిత్స చేయించుకుని సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు విడుదలైన చెక్కులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం బాధితుల ఇంటికెళ్లి అందజేశారు. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఆంజనేయులుగౌడ్‌కు రూ.లక్షా 50వేలు, బండారునగర్‌కు చెందిన వెంకటేశ్‌గౌడ్‌కు రూ.47,500, ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన జాహంగీర్‌కు రూ.37,500, గాంధీనగర్‌కు చెందిన అలివేలుకు రూ. 37వేలు, పోచమ్మ గుడి దగ్గర కృష్ణయ్యకు రూ.10వేల విలువ గల సీఎం సహాయనిధి చెక్కును పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, వనపర్తి పట్టణాధ్యక్షుడు గట్టుయాదవ్ , కౌన్సిలర్లు వాకిటిశ్రీధర్, పాకనాటి కృష్ణయ్య, తిరుమల్, పుట్టపాకుల పార్వతి, నందిమల్ల భువనేశ్వరి, నాయకులు కురుమూర్తి యాదవ్, మురళీసాగర్ ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...