జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్‌కు క్రీడాకారులు


Sat,June 15, 2019 12:33 AM

వనపర్తి క్రీడలు: ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో జరిగే జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఎక్సిక్యూటివ్ మెంబర్ బోలమోని కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ వీరందరు వారం రోజులుగా హైదరాబాద్‌లోని వర్ధమారన్ ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంప్‌లో ఉండి తెలంగాణ రాష్ట్ర జట్టుకు మల్లేశ్, నరసింహ, వెంకటేష్, నవీన్ ఎంపికైనట్లు ఆయన తెలిపారు. నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ తరుపున జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్, సబ్ జూనియర్, ఉమెన్ విభాగాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఈ జట్టుకు ఎంపికైన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోటూరు శ్రీనివాస్‌గౌడ్, సభ్యులు రాంమోహన్, వహీద్, కార్తీక్, హాకీ క్రీడాకారులు అభినందించారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...