పశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి


Fri,June 14, 2019 03:21 AM

కొత్తకోట : నిరుపేద ముస్లిం, మైనార్టీలకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి టీఆర్‌ఎస్ నాయకులు జి.ఎం.గౌస్, చాంద్‌పాషలు వినతిపత్రం అందజేశారు. ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించి సీఎం కేసీఆర్ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారని గుర్తు చేస్తూ క్షేత్రస్థాయిలో ఆ బడ్జెట్ పేద మైనార్టీలకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుపేద బలహీన వర్గాల ముస్లింలకు రెండు, మూడు సంవత్సరాలుగా బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందక నిరుపేద, చిరు వ్యాపారాలు చేసే ముస్లింలు అవస్థలు ఎదుర్కొంటున్నారని వివరిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పూర్తి సబ్సిడీతో బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చి ముస్లింలను ఆదుకోవాలని కోరారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...