లక్ష్యానికి


Thu,June 13, 2019 03:59 AM

వనపర్తి,నమస్తే తెలంగాణ ప్రతినిధి: కష్టించి రైతు పండించిన ధాన్యానికి ధర రాకుంటే...ఏడాదంతా చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కష్టాలను గుర్తించిన ప్రభుత్వం ప్రతి సీజన్‌లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. ధాన్యం కొనుగోలు జరిపినప్పటికీ ఇలా పారదర్శకంగా కొనసాగలేదు. ప్రభుత్వంలో రైతన్నలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదలుకొని పంట పండించడం..ధాన్యం విక్రయించడంలాంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటూ వస్తున్నది. ఏడాది యాసంగి సీజన్‌లో 83 కేంద్రాల ద్వారా జిల్లాలో వరి ధాన్యం సేకరణ జరిపారు. అవసరానికి తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధికారుల ప్రణాళికలు గడువులో బ్యాంకు ఖాతాల్లో నగదు జమలు వెరసి జిల్లాలో ధాన్యం సేకరణను విజయవంతంగా కొనసాగించారు. సివిల్ సప్లయ్ అధికారులు. పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం దళారుల బెడద లేకుండా రైతులకు కొనుగోళ్లలో బాసటగా నిలిచింది.

లక్ష్యం లక్ష మెట్రిక్ టన్నులైతే....
యాసంగిలో జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. యాసంగిలో జరిగిన సాగుబడుల అంచనాలతో వ్యవసాయ అధికారులు ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష 5 వేల 249 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లాలో కొనుగోళ్లు చేశారు. సెంటర్ల ద్వారా జరిపిన కొనుగోళ్లు గత వారం రోజుల క్రితం ముగిశాయి. దాదాపు రెండు నెలలకు పైగా ఈ సెంటర్లు జిల్లాలో నిరాటంకంగా పని చేశాయి. గ్రేడ్-1రకానికి 1770 రూపాయలు చెల్లిస్తే...కామన్ రకానికి 1750 రూపాయలుగా క్వింటాళ్లుకు ప్రభుత్వం మద్దతు ధరగా ప్రకటించి కొనుగోలు చేసింది. అనుకున్న లక్ష్యంను చేరుకున్న అధికారులు రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా యాసంగి కొనుగోళ్లను ముగించారు.

రైతుల ఖాతాలో 124 కోట్లు....
యాసంగి రైతులతో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం అందుకనుగుణంగా చెల్లింపులను చేపట్టింది. తర్వాత రైతు పాసుబుక్, ఖాతా జిరాక్స్‌లను తీసుకుని సంబంధిత కొనుగోలు సెంటర్ నుంచి సివిల్ సప్లయ్ జిల్లా కార్యాలయానికి సమాచారంను అన్‌లైన్‌లో అనుసంధానం చేస్తున్నారు. అనంతరం రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో యాసంగి సీజన్‌లో 17441 మంది రైతుల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేశారు. వరకు 12121 మంది రైతులకు 124 కోట్ల రూపాయలను అన్నదాతల అకౌంట్లో జమ చేశారు. ఇంకా 5320 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కావాల్సి ఉంది. దశలో వచ్చిన రైతుల సమాచారం అనుసంధానం చేసి త్వరగా డబ్బులు జమ చేసేందుకు అధికార కృషి చేస్తుంది. కాగా,ఇంకా రైతులకు దాదాపు 56 కోట్ల రూపాయలు అందాల్సి ఉంది.

రైతులకు అనువుగా కేంద్రాలు....
ప్రతి సీజన్‌లో కొనుగోళ్లను జరుపుతున్న ప్రభుత్వం రైతులకు మరింత అనువుగా ఏర్పాటు చేస్తుంది. మొక్కుబడిగా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి అస్తవ్యస్తంగా గతంలో కొనుగోళ్లు జరిపిన పరిస్థితులు తెలియనివి కావు. నేడు పక్కా సాగుబడులు దిగుబడులు సేకరణల లక్ష్యాలను లెక్కలోకి తీసుకుని కొనుగోళ్లు కేంద్రాలను సర్కార్ ఏర్పాటు చేయిస్తుంది. ఈ మేరకు యాసంగిలో మూడు శాఖల ద్వారా జిల్లాలో 83 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేశారు. ఐకేపీ 42, పీఏసీఎస్ 39, మెప్మా ఆధ్వర్యంలో 2 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరిగింది. ధాన్యం ఒకేసారి రద్దీగా వచ్చిన సందర్భంలో కొంత గన్నీ బ్యాగుల సమస్య ఉత్పన్నం అయినప్పటికీ వెంటనే అధికారులు అప్రమత్తం కావడంతో సమస్య సద్గుమణిగింది. కల్లాల దగ్గరే రైతులకు అనువుగా ఉండేచోట కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు జరిపించడంతో అన్నదాతలు ఉపశమనం పొందారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...