పనితీరు మార్చుకోకుంటే వేటు తప్పదు


Thu,June 13, 2019 03:58 AM

మదనాపురం : అధికారులు తమ పనితీరు మార్చుకోకుంటే వేటు తప్పదని కలెక్టర్ శ్వేతామొహంతి అ న్నారు. బుధవారం మదనాపురం, నెలివిడి, నర్సింగాపురం గ్రామాల్లోని నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. మొక్కల పెంపకం సరిగ్గా లేదంటూ అధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అ ధికారులతో మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలనే సంకల్పంతో, ఆయా గ్రామాల్లో ప్రభుత్వమే రైతు ల పొలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెం చుతున్నదన్నారు. కానీ కింది స్థాయి అధికారులు మా త్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ పనితీరు మార్చుకుని మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. 10 రోజుల తరువాత మళ్లీ వస్తానని, అప్పటివరకు ప్రతి నర్సరీలో మొక్కల పెంపకంలో పురోగతి కనిపించాలని ఆధికారులను ఆదేశించా రు. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయా..? అని నర్సరీలను పెంచుతున్న రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీవో గణేష్, ఏపీడీ నర్సింహులు, తహసీల్దార్ సిం ధూజ, ఎంపీడీవో కతలప్ప, ఈ డీపీఆర్వో సుదర్శన్, ఏపీవో శేఖర్‌గౌడ్, పంచాయతీ సెక్రటరీ రంగస్వామి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతు సమన్వయ స మితి మండల కో ఆర్డినేటర్ హనుమాన్‌రావు, గ్రామాధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, సర్పంచ్ రాంనారాయణ, ఎంపీటీసీ కుర్మయ్య, మాజీ ఎంపీటీసీ తిరుపతయ్య, కరుణాకర్, లక్ష్మీకాంత్‌రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...