మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి


Thu,June 13, 2019 03:58 AM

-వాహన శిక్షణ పొందేందుకు ముందుకు రావడం అభినందనీయం
-శిక్షణ పొందుతున్న మహిళలతో ఎస్పీ అపూర్వరావు సమీక్ష
వనపర్తి విద్యావిభాగం : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో ఉచిత డ్రైవింగ్ శిక్షణను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ భవనంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణ పొందిన, పొందుతున్న మహిళలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శిక్షణ నేర్చుకోవడంలో ఏమైనా జాప్యం జరిగిందా..? నేర్పించడంలో ఏమైనా ఇబ్బందులు జరిగాయా..? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలలుగా శిక్షణ డ్రైవింగ్ చాలా సంతృప్తిగా ఉందని, దానికి తామెంతో అదృష్టంగా భావిస్తున్నామని శిక్షణ పొందిన మహిళలు ఎస్పీని కొనియాడారు. ఇలాంటి అవకాశాలను మళ్లీ కల్పిస్తే చాలా బాగుంటుందని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే వనపర్తి జిల్లాలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణను ఏర్పాటు చేయడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించినప్పుడే అభివృద్ధి చెందుతారని, గతంలో మహిళలు వంటలకే పరిమితం కావడం, కుట్టుమిషన్, ఎంబ్రాయిడర్, బ్యూటీపార్లర్ వంటి వాటిలో మాత్రమే శిక్షణ పొందేవారన్నారు. ప్రస్తుత పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయని, ఎంతో మంది మహిళలు విభిన్న రంగాల్లో శిక్షణ పొంది ప్రావీణ్యం సంపాదిస్తున్నారన్నారు. వనపర్తిలో వాహన శిక్షణ పొందేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. చదువుకున్న యువతులు ఉద్యోగం కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా వారి కాళ్లమీద వారు నిలబడాలని, అవసరమైతే డ్రైవింగ్ శిక్షణ స్కూల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. శిక్షణతో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, శిక్షణ పొందిన మహిళలందరికీ జిల్లా పోలీస్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నరేందర్, పీఆర్‌వో రాజాగౌడ్, ఉచిత డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...