అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి


Thu,June 13, 2019 03:58 AM

-ప్రాదేశిక ఎన్నికల్లో విజయఢంక మోగించాం
-ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి పాటుపడాలి
-పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కొత్తకోట : అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కనిమెట్ట, పాత జంగమాయిపల్లి పోచమ్మ గుడిలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికల్లో నియోజకవర్గంలో విజయఢంకా మోగించామన్నారు. గెలుపొందిన ప్రతి ఒక్కరూ గ్రామాలాభివృద్ధికి పాటుపడాలన్నారు. మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా కలిసిమెలసి పనిచేయాలని సూచించారు. పాత జంగమాయిపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక, వైస్ ఎంపీపీ వడ్డె శ్రీను, సర్పంచ్ రాణి పరమేష్, మాజీ జెడ్పీటీసీలు విశ్వేశ్వర్, బాబు, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, సీడీసీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, భీంరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పెంటన్న, కోటీశ్వర్‌రెడ్డి, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...