వైద్యులు సేవాభావంతో ఉండాలి


Thu,June 13, 2019 03:57 AM

వనపర్తివైద్యం:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని గాంధీచౌక్‌లో డాక్టర్ లివింగ్‌స్టన్‌కు చెందిన వనపర్తి మల్టీస్పెషాల్టీ ప్రైవేటు ఆసుపత్రిని మంత్రి రిబ్బెన్ కట్‌చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సేవా దృక్పథంతో ప్రజలకు ఎవరైనా వైద్యు సహకారంతో సేవలను అందించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులన్నీ ప్రభుత్వ నిబంధనాలను పాటించడంతో పాటు ప్రజలకు సేవలందించే విషయంలో ఆసుపత్రుల్లో సేవలు విస్తృతం కావాలని మంత్రి సూచించారు. ప్రతి రంగంలో పట్టుదల, శ్రమతో కృషి చేసిన వారు విజయాలను సాధించి ఉన్నతంగా ఎదుగుతారన్నారు. సమాజంలో ప్రజల ఆరోగ్య సమస్యలన్నింటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల అవసరం కూడా ఉంటుందన్నారు. అనంతరం డాక్టర్లు మంత్రిని శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్. జెడ్పీచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేశ్‌గౌడ్, డాక్టర్లు నిర్మల లివింగ్‌స్టన్, పారిజాత, లలిత కృష్ణకుమార్, చల్మారెడ్డి, రాఘవులు, నవీన్‌కుమార్, నికిల విశోక్, శరత్‌చంద్ర, అరుణజ్యోతి, మేనేజ్‌మెంట్ సభ్యులు శీను, ప్రసాద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...