విధుల్లోకి విద్యావలంటీర్లు


Thu,June 13, 2019 03:57 AM

వనపర్తి విద్యావిభాగం: ప్రభుత్వ బడుల్లో బోధన బలోపేతం కోసం తక్షణమే విద్యా వాలంటీర్ల నియామకానికి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరతను తీర్చి అర్హులైన, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వాటిలో విద్యావలంటీర్లను నియామకం చేసి బోధన కొనసాగిస్తున్నారు. గత ఏడాది కూడా విద్యావలంటీర్ల నియామకాలు చేసి బోధన అందించారు. ఈ ఏడాది ఎంపికైన పీఆర్‌టీల నియామకాలు చేపట్టవాల్సి ఉండగా అది కాస్త ఆలస్యం కావడంతో విద్యా బోధన నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర విద్య సంచాలకులు మంగళవారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించి తక్షణమే ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖలకు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సంచాలకులు పాతవారినే విద్యా వాలంటీర్‌గా కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వడం అభినందనీయమని విద్యావలంటీర్ల జిల్లా అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ వేతనంతో విద్యా బోధనలో సేవలు అందిస్తు ఈ సేవలను మళ్లీ కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. నియామకమైన వారినే ప్రతియేట కొనసాగిస్తారో లేదో అనే మీమాంసకు ప్రభుత్వం తెరదింపి ప్రతియేట రెన్యూవల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 12 నెలల వేతనాలు ఇస్తే బాగుంటుందని విద్యావలంటీర్లు చెబుతున్నారు.

నియామకాలు ఇలా..
గతంలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఎంపిక కాబడ్డ విద్యా వలంటీర్లనే కొనసాగిస్తు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఇటీవల కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు పదవీ విరమణ పోందడం, ఉపాధ్యాయులు బదిలీలో వెళ్లడం , ఆరోగ్య రీత్యా , ఇతరత్ర కారణాలచేత దీర్ఘకాలిక సెలవులలో ఉండడం తదితర ఆంశాలను పరిగణలోకి తీసుకొని ఆ స్థానంలో విద్యావలంటీర్ల నియామకం ఎంఈవోలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు వెల్లడించారు. దీంతో అన్ని ఆంశాలను పరిగణలోకి తీసుకొని ఎంఈవోలే క్షేత్రస్థాయిలో విద్యావలంటీర్ల నియామకం చేయాల్సి ఉంది.

జిల్లాలో మండలాల వారీగా విద్యావలంటీర్లు....
వనపర్తి జిల్లాలో 14 మండలాల్లో 212 మంది విద్యావలంటీర్లను నియామకం చేయనున్నారు. అందులో అమరచింత 17, ఆత్మకూర్ 34, చిన్నంబావి 36, ఖిల్లాఘణపురం 9, గోపాల్‌పేట 8, కొత్తకోట 11, మదనాపురం 9, పాన్‌గల్ 9, పెబ్బేర్ 15, పెద్దమందడి 12, రేవల్లి 10, శ్రీరంగాపురం 5, వనపర్తి 17, వీపనగండ్ల 20 మొత్తం 212 మంది విధుల్లో చేరనున్నారు. కాగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఏడాది 515 కు ప్రతిపాదనలు పంపగా పాత నియమించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో 212తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...