హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలి


Wed,June 12, 2019 03:09 AM

ఖిల్లాఘణపురం : హరితహారం నాటికి మొక్కలను సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని, తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ శ్వేతామొహంతి సూ చించారు. మంగళవారం మండల కేంద్రం, గట్టుకాడిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహా రం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది మొక్కలను విరివిగా నాటి అట వీ శాతాన్ని పెంచేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో ఒ క నర్సరీని ఏర్పాటు చేసిందని అన్నారు. నర్సరీలోని మొక్కలను యజమానులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి పెంపకంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హ రితహారం కార్యక్రమం నాటికి మొక్కలు నాటేందుకు గుంతలు కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ స్థ లాల్లో విరివిగా మొక్కలు నాటాలని, ఉపాధిహామీ కూ లీలతో కంపచెట్లను తొలగించి గుంతలు తవ్వించాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని తప్పనిసరిగా చే రుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ఆవరణ ల్లో, వ్యవసాయ పొలాల్లో తదితర స్థలాల్లో మొక్కలను నాటాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత అధికారులదేనన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో గణేష్, ఎంపీడీవో వెంకటకృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకటకృష్ణ, ఏపీవో సురేష్, సర్పంచ్ వెంకటరమణ దేవేందర్, ఉప సర్పంచ్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి మానస, వార్డు సభ్యులు శేఖర్, లింగస్వామి, చెన్నయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...