ప్రతి రైతు పంట బీమా చేసుకోవాలి


Wed,June 12, 2019 03:08 AM

వనపర్తి రూరల్ : ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వానాకాలం సీజన్‌లో వేసే వరి, మొక్కజొన్న, వేరశనగ, కంది, జొన్న, మీరప, పత్తి పంటలకు మాత్రమే పథకం పనిచేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి సుజాత తెలిపారు. మంగళవారం తన చాంబర్లో ఫసల్ బీమాకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. బీమా కింద ఎంపిక చేసిన పంటలకు రైతులు బీమా చెల్లించేందుకు వ్యవసాయశాఖ తేదీలను ఖరారు చేసింది. ఆ ప్రకారం బీమాను అగ్రికల్చర్ ఇన్యూరెన్స్ కంపెని ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థను ఎంపిక చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే ఎంపిక చేసిన పంటలకు బీమా చేసుకుంటే పంటకు నష్టం జరిగినప్పుడు పరిహారం పొందవచ్చునని ఆమె వెల్లడించారు. మన జిల్లాలో వరి, మొక్కజొన్న, వేరశనగ, కంది, జొన్న, మీరప, పంటలు మాత్రమే బీమాకు అర్హత ఉందని తెలిపారు. అలాగే బీమా చేసుకొవడం వల్ల ప్రకృతి వైపరిత్యాలు, తూఫాన్, అకాల వర్షాలు, అగ్రి ప్రమాదాలు, పిడుగు పాటు, తెగుళ్లు బెడద, గాలివానల వల్ల జరిగే పంట నష్టాన్నికి పరిహారం అందుతుందని, అతి తక్కువ ప్రీమియం చెల్లించి పరిహారం పొందేలా భరోసా కల్పించే పథకం ఇది పంట రుణాలు పొందిన రైతులు, పొందని రైతులు సైతం బీమా ప్రీమియం నిర్మిత గడువులోగా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనికి మండల వ్యవసాయాధికారుల ద్వారా చెల్లించాలి. సాగు చేసే రైతులు సొంత పట్టాదారులు అయిన, కౌలుదారు రైతులు కూడా బీమాకు అర్హులే, వరి పంటకు మాత్రమే గ్రామాన్ని యూనిట్‌గా, మిగతా పంటలకు మండలం యూనిట్‌గా పరిగణిస్తున్నారు.
వానాకాలం సీజన్‌లో పునర్వవ్యస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా ప్రత్తి, మిరప పంటలను ఎంపిక చేశారు.

త్తి, మిరప పంటలకు అల్ప వర్షపాతం, అధిక వర్షపాతం, అల్ప ఉష్ణోగ్రత వీటిని పరిగణలోకి తీసుకుంటారని, బీమా ప్రీమియం చెల్లించేందుకు పంటల వారిగా తేదీలు వరికి ఆగస్టు 31వ తేదీ వరకు ప్రీమియం ఎకరానికి రూ. 680 చెల్లిస్తే రూ. 34 వేలు కవరేజ్ అవుతుందని, జొన్న, కందిలకు జూలై 31 వరకు రూ.280లు చెల్లిస్తే రూ. 14వేల కవరేజ్ అవుతుందని, మొక్కజొన్నకు జూలై 31 వరకు ప్రీమియం చెల్లించవచ్చునని రూ. 500 చెల్లిస్తే రూ.25వేలు కవరేజ్, వేరుశనగకు రూ.380 ప్రీమియం చెల్లిస్తే రూ. 19 వేలు, పత్తికి రూ.1750 చెల్లిస్తే రూ. 35 వేల కవరేజ్ అవుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...