ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పులు చేయించుకోండి


Wed,June 12, 2019 03:07 AM

వనపర్తి రూరల్ : తెలంగాణ ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వ దవాఖానలను బలపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కడుకుంట్ల పీహెచ్‌సీ వైద్యుడు రాకేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మం డలంలోని కడుకుంట్ల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పుఅయిన మూడవత్ భారతికి కేసీఆర్ కిట్‌తో పాటు పాప జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలలో కాన్పు అయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని వసతులను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలలో కాన్పు లు చాలా సురక్షితంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...