వేతనాలు చెల్లించాలని నిరసన


Wed,June 12, 2019 03:07 AM

ఖిల్లాఘణపురం : కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్‌లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారిం దని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. అనంతరం అధికారులు నచ్చజెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...