బాల్య వివాహాలు చేయడం నేరం


Wed,June 12, 2019 03:07 AM

-ఎంపీడీవో సాయిబ్రిందా
పెద్దమందడి : బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో సాయిబ్రిందా అన్నారు. మంగళవారం మండలంలోని మనిగిల్ల గ్రామంలో ఈనెల 21న మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం తెలియడంతో ఎంపీడీవో, ఈవోఆర్డీ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు బాల్యవివాహంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహం చేస్తే జరిగే అనర్థాల గురించి వారికి వివరించారు. 18 నిండిన తర్వాతనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలని చెప్పారు. బాల్య వివాహం చేయ డం ద్వారా కల్యాణలక్ష్మీ లాంటి పథకాలు కూడా వర్తించవన్నారు. అదేవిధంగా అమ్మాయిలు అనారోగ్యానికి గురవుతారని తల్లిదండ్రులకు సూచించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...