మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్


Wed,June 12, 2019 03:06 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : పట్టణం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి పట్టణ ప్రజలను కోరారు. మున్సిపాలిటీ ఆధ్వర్యం లో మంగళవారం పట్టణంలోని 22వ వార్డులో స్వచ్ఛ స్వరేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలను భాగస్వాములను చేస్తూ కమిషనర్ కాలనీలో పేరుకుపోయిన చెత్త, వీధులను శుభ్రం చేశారు. అన ంతరం వార్డు ప్రజలకు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆర్‌వో నరేష్ రెడ్డి, సానిటరి ఇన్స్‌స్పెక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, పర్యావరణ ఇంజినీర్ మధు, సీనియర్ అసిస్టెంట్ సాయిరాం, జవాన్లు మోహన్, మన్నెం, వెంకటస్వామి, వార్డు ప్రజలున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...