ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలి


Wed,June 12, 2019 03:06 AM

గోపాల్‌పేట : మండలంలోని పొల్కెపహాడ్ గ్రా మానికి గతంలో ఆర్టీసీ బస్సు నడిచేదని ఇప్పుడు నడవటంలేదని మా గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరారు. గ్రామానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు గ్రామం నుంచి విద్యార్థులు చదువుకునేందుకు, గ్రామస్తులు తమ సొంత పనులపై మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లుతుంటారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవే టు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. విద్యార్థులకు ఉచిత బస్సు పాసు సౌకర్యం ఉన్నా ఉపయోగం లేకుండా పోతుంది. చదువు కునేందుకు పాఠశాలకు, కళాశాలకు వెళ్లాలంటే ప్రతి రోజు రాను పోను 8కిలో మీటర్లు కాలినడక తప్పడం లేదు. గ్రామానికి బస్సు నడపాలని పలుమార్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువేలినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...