బడిబాట పట్టించండి


Tue,June 11, 2019 03:17 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర బడి బాట కార్యక్రమంలో బడీడు పిల్లలను అందరిని పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ శ్వేతామొహంతి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంపై సమన్వయ సమావేశా న్ని నిర్వహించారు. ముందుగా సంబంధిత అధికారులతో బడిబాట కార్యక్రమంపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బడిబాట కార్యక్రమ సంసిద్ధత కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్ని గుర్తించి పాఠశాలల్లో వారిని మొదటి తరగతిలో చేర్పించాలని ఇందుకుగాను ఆయా అంగన్‌వాడీ కేంద్రాల వారి గా ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లల వివరా లు, బడులలో చేర్పించే లక్ష్యాలను సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఈ బాధ్యత పూర్తిగా సంబంధి త ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, అంగన్‌వా డీ కార్యకర్తలపై ఉందన్నారు.

అదేవిధంగా 5వ తరగతి నుంచి 6వ తరగతి వెళ్లే విద్యార్థులు లక్ష్యం ఎం తో నిర్దారించి ఈ వివరాలన్నింటిని ఈనెల 11 లోగా సమర్పించాలని ఆదేశించారు. సంక్షేమ హాస్ట ల్‌లో జూన్ మాసంతో ఎంత మంది విద్యార్థులు హాస్టళ్లలో చేరారు మార్చి నాటికి ఎంత మంది ఉన్నారు ఎంత మంది మధ్యలో బడి మానేశినవా రు వంటి వివరాలు సమర్పించాలన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని ఆదేశించారు. మధ్యలో బడి మానేసిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయుడు కలిగి ఉం డాలని, ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలో చేరవలసిన విద్యార్థులను చేర్పించాల్సిన బాధ్యత ప్రాథమిక ప్రధానోపాధ్యాయులతో పాటు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. అంతేకాకా 7వ తరగతి నుంచి 8వ తరగతికి వెళ్లే విద్యార్థులను ఉన్నత పాఠశాలలో చేర్పించే బాధ్యత ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులతో పాటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 14న మొద టి రోజు మన ఊరు బడి, 15వ తేదీన బాలిక విద్య , 17వ తేదీన సామూహిక అక్షరభాస్యం, 18వ తేదీన స్వచ్ఛ పాఠశాల, హరితహారం, 19వ తేదీన యాజమాన్య కమిటీ, బాల కార్మికుల విముక్తి అనే అంశాలను ప్రధానాంశాలుగా చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజున అందరు ప్రజాప్రతినిథులు భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని అన్ని ఆవాసప్రాంతాలు కవర్‌అయ్యే విధంగా కార్యక్రమం రూపొందించాలని, గ్రామస్తులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, డీఆర్డీవో గణేష్, వ్యవసాయ అధికారి సుజాత, డీఎంహెచ్‌వో రవిశంకర్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్, ఎంఈవోలు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...