సన్‌డే 44


Mon,May 27, 2019 03:15 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో ఎండల ప్రభావం ఊహకందని రీతిలో పెరిగి పోతుంది. వారం రోజులుగా పెరిగిన ఎండలతో జనం అల్లాడుతున్నారు. తీవ్ర వడగాల్పులతో కూడిన ఎండల ప్రభావంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లా వ్యాప్తంగాను ఆయా మండలాల్లో ఉష్ణోగ్రతలు భగ.. భగమంటున్నాయి. జూన్ మొదటి వారంలో వాతావరణంలో మార్పులుంటాయని చెబుతున్న క్రమంలో ప్రస్తుత ఎండల ప్రభావం ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తుంది. రుతుపవనాల మాట అటుంచి నేటి ఎండల నుంచి ఎలా బయటపడాలన్నట్లుగా జనం బిక్కుబిక్కుమంటున్నారు.

14 మండలాల్లో ఎండల ప్రభావం..

జిల్లాలోని 14 మండలాల్లోను ఎండల మోత మోగుతు ంది. ఉదయం మొదలు సాయంత్రం వరకు ప్రచండ భానుడు భగ.. భగ మంటున్నాడు. అన్ని మండలాల్లో ను 42 డిగ్రీల ఉష్ణోగ్రతలను మించి ఎండలు దంచుతున్నాయి. ఇదే ప్రభావం మరో మూడు రోజులకు పైగా జిల్లాలో ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. శనివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కాగా, ఎండలు ఎక్కువయ్యా యి. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని నానుడి ఉంది. దీనికితగ్గట్టుగా వచ్చే రెండు రోజుల్లో మరింతగా ఎండల ప్రభావం ఉండేలా కనిపిస్తుంది.

బయటకు వెళ్లాలంటేనే భయం..

ఉదయం వేళల్లోనే బయటకు రావాలం టే జనం బేంబేలెత్తుతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం 7 గంటలైనా ఎండల వేడి తగ్గడం లేదు. ఇంట్లో ఉండే జనం కూలర్లకు అతుక్కుపోయినట్లుగానే ఉంటున్నారు. ఇంట్లోనే కూలర్ ముందు నుంచి పక్కకు రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులున్నాయి. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు నిర్మాణుస్యమవుతున్నాయి. అత్యవసరమున్న వారు మినహా ఇతరులు బయటకు రావడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అత్యవసర ప్రయాణాలు ఉదయం.. సాయంత్రం మాత్రమే చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ఏసీ వాహన సౌకర్యం ఉ న్న వారు ప్రయాణాల్లో ఎండల నుంచి కొంత ఉపశమ నం పొందుతున్నారు. ఆర్టీసీ ప్రయాణాల్లోను ఏసీ బస్సుల వసతులున్న చోట జనం ఎగబడే పరిస్థితులున్నాయి. మరో రెండు, మూడు గంటలు ఆగి అయినా సరే ఏసీ బస్సు ఉంటే.. అందులోనే వెళదామనుకున్న పరిస్థితులు లేకపోలేదు.

మండలాల్లో ఉష్ణోగ్రతలు ఇవి..

జిల్లాలోని వివిధ మండలాల్లో ఆదివారం నాటి ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. వనపర్తి 44 డిగ్రీలు, మదనాపురం 43 డిగ్రీలు, ఖిల్లాఘణపురం 42 డిగ్రీలు, గోపాల్‌పేట 42 డిగ్రీలు, పాన్‌గల్ 41 డిగ్రీలు, కొత్తకోట 43 డిగ్రీలు, ఆత్మకూరు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, ఐదు రోజులుగా వనపర్తిలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.

జాగ్రత్తలు తీసుకోవాలి..

ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయటకు వెల్లకపోవడం మంచిది. చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూడాలి. ఒకవేళ వెళ్లినా గొడుగు, నీల్ల బాటిల్, తలకు టోపిలాంటివి ధరించి వెళ్లాలి. ఎండల ప్రభావంతో విరేచనాలు.. వాంతులు వస్తే వెంటనే దగ్గరలోని దవాఖానకి వెళ్లాలి. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు వద్ద ఓఆర్‌ఎస్ పాకెట్స్ సిద్ధంగా ఉంచాం. అలాగే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలోను ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం.
- డా. రవిశంకర్, ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారి, వనపర్తి

ఎండలకు తట్టుకోలేకపోతున్నాం..

నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ సంవత్సరం ఉన్నంత ఎండలు మునుపెన్నడూ చూడలేదు. ఉదయం 7 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉక్కపోత కూడా చాలవుంది. పనిమీద బయటికి వెల్లాంటే భయమేస్తుంది. అత్యవసరమైతే తప్ప ఎండలో వెల్లలేక పోతున్నాం. వరుణదేవుడు కరుణించి త్వరగా వర్షాలు కురుపిస్తే తప్ప భూమిపై ఈ వేడిమి చల్లారదు.
- ఆంజనేయులు, రామన్‌పాడు గ్రామం

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...