మృత దేహంతో సబ్‌స్టేషన్ ముట్టడి..


Mon,May 27, 2019 03:13 AM

-న్యాయం చేయాలంటు గ్రామస్థులు నిరసన..
-మద్దతు పలికిన బిఎల్‌ఎఫ్ నాయకులు.
మల్దకల్ ; మండలంలోని మల్లెందొడ్డి గ్రామానికి చెందిన కుర్వ నర్సింహులు శని వారం విద్యుత్ షాక్‌కు గురి కాగా చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శని వారం రాత్రి మృతి చెందాడు. కాగా ఆదివారం ఉదయం నుంచే కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. కాగా ఈ నిరసనకు బిఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంజిత్‌కుమార్ మద్దతు పలికారు.

-మృత దేహంతో సబ్ స్టేషన్ ముందు నిరసన..
కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడు కుర్వ నర్సింహులు పోస్టు మర్ఠం ఆనంతరం గ్రామానికి తీసుకువచ్చారు. అయితే కారులో శవంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు దర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ సబ్ స్టేషన్‌లో పని చేస్తున్న లైన్‌మేన్ నిర్వాహకంతో నర్సింహులు మృతి చెందాడని వాపోయారు. లైన్ క్లియర్ కోసం ఎల్‌సీ కోసం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లీనట్లు తెలిపారు. అక్కడ పనిచేస్తున్న లైన్‌మెన్ ద్వారా లైన్ క్లియర్ కోసం ఎల్‌సీ తీసుకోవడం జరిగిందన్నారు. అయితే ఎల్‌సీ ఇస్తాం వెళ్లీ తమ పనులు చూసుకోండని చెప్పడంతో నర్సింహులతో పాటు మరోకరు తమ వ్యవసాయ పోలం దగ్గరికి వెళ్లారు. ఎల్‌సీ తీసుకున్నామని భరోసాతో బావికి మోటారు వైర్లను సరిచేయడం కోసం వైర్లను పట్టు కోవడం జరిగిందన్నారు.

అయితే వెంటనే విద్యుత్ షాక్‌కు గురి కావడంతో త్రీవ గాయాలు అయ్యాయన్నారు,. వెంటనే గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించంగా మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలింబగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ఇదంతా లైన్‌మెన్ నిర్వాహకంతోనే ఇలా మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపించారు. మృతునికి నష్ట పరిహారం ఇచ్చేంత వరకు శవంను ఇక్కడి నుంచి తరలించేది లేదని మొండికేశారు.ఇంత జరిగిన విద్యుత్ అధికారులు సబ్ స్టేషన్‌కు రాకపోవడంతో గ్రామస్ధులు ఆగ్రహం వెల్లుబుచ్చారు. ఎంతకు విద్యుత్ అధికారులు రాకపోవడంతో సిబ్బదిపై కేసుపెట్టి శవంను అక్కడి నుంచి తరలించారు,.

-లైన్‌మెన్ సస్పెండ్ చేయాలి... రంజిత్‌కుమార్..
మల్లెందొడ్డి గ్రామంలో కుర్వ నర్సింహులు మృతికి కారణం అయిన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న లైన్‌మెన్, ఆపరేటర్‌ను వెంటనే విధులను నుంచి తొలగించాలని కోరారు. అలాగే మృతుని కుటుంబాన్ని విద్యుత్ శాఖ నుంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ లైన్‌మెన్‌పై మల్దకల్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు తెలిపారు.

-ఎస్‌ఐ వివరణ...క్రిష్ణబుల్ రెడ్డి,.
.మల్లెందొడ్డి గ్రామ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న విద్యుత్‌లైన్‌మెన్, ఆపరేటర్‌పై మృతుని కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారని ఎస్‌ఐ క్రిష్ణబుల్‌రెడ్డి తెలిపారు. అయితే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. దర్యాప్తు ఆధారంగా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామాన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...