రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ మృతి


Mon,May 27, 2019 03:12 AM

ఇటిక్యాల: మండలంలోని తిమ్మాపూర్ గ్రామ వీఆర్‌ఓ బీసన్న 24వ, తేది శుక్రవారం సాయంకాలం 6గంటలకు తమ గ్రామానికే చెందిన ఈశ్వరయ్య బైక్‌పై ఎర్రవల్లి చౌరస్తా నుండి తిమ్మాపూర్ కు (పదవ పటాలం వెనుకాల రోడు)్డ వెళ్తున్నాడు. బైక్ గ్రామం వైపు మలుపు తిప్పుతుండగా ఎర్రవల్లి చౌరస్తా ్తనుండి గద్వాల వైపు వెళ్లే గుర్తు తెలియని మోటార్‌బైక్ వెనుక గుండా ఢీకొట్టింది.ఈసంఘటనలో బైక్ వెనుకాల కూర్చొన్న బీసన్న గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఇటిక్యాల ఎస్సై రాజు తెలిపారు. వీఆర్‌ఏ బార్య మణెమ్మ పిర్యాధు మేరకు కేసే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.కాగా మృతుని కుటుంబాన్ని తహశిల్దార్ రమేశ్‌రెడ్డి పరామర్శించి తక్షణ సహాయం క్రింద 20వేల,రుపాయల నగదును అందజేశారు.ఈకార్యక్రమంలో తిమ్మాపూర్ వీఆర్‌ఏ మద్దిలేటి ఉన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...