ఆశవర్కర్ నిర్లక్ష్యంతో పుట్టిన పసిపాప మృతి


Mon,May 27, 2019 03:12 AM

లింగాలః ఆశ వర్కర్ సకాలంలో స్పందించక పోవడంతో పుట్టిన పసిపాప రెండు రోజులకే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.బాధితురాలు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.మండలంలోని పద్మన్నపల్లి గ్రామానికి చెందిన నిండు గర్బీణి అయిన మూడావత్ జ్యోతికి ఈనెల 24న పురిటి నొప్పులు వచ్చాయి.ఈ విషయాన్ని ఆశ వర్కర్ చాందిబాయికి సమాచారం ఇచ్చినప్పటికి నాకు వేరే పని ఉంది.నేను రాలేనని సమాదానం ఇచ్చినట్లు బాధితురాలు జ్యోతి ఆందోళన వ్యక్తం చేసింది.పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో 108 అంబులెన్స్‌లో లింగాల ఆస్పత్రికి వెళ్లగా మగబిడ్డ పుట్టాడు.సకాలంలో ఆస్పత్రికి రాకపోవడంతో పుట్టిన బాబు పరిస్థితి బాగాలేదని సిబ్బంది తెలపడంతో ప్రైవేట్ వాహనంలో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి చేరుకునే లోపే బాబు చనిపోయినట్లు తెలిపారు.ఆశ వర్కర్ సకాలంలో స్పందించి ఉంటే బాబు బ్రతికే వాడని,నిర్లక్ష్యం వల్లనే బాబు దక్కలేదని వాపోయింది.బాబు మృతికి కారణమైన ఆశవర్కర్‌పై కఠీనమైన చర్యలు తీసుకొవాలని గిరిజన నాయకులు శంకర్,భీముడు,అంజీ,రాజు,శక్రు,మోహన్,చందర్,హతిరాం,తుల్సిరాం,వార్డు సభ్యులు శంకర్ డిమాండ్ చేశారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...