ఇద్దరిపై కేసు నమోదు


Mon,May 27, 2019 03:12 AM

మక్తల్, నమస్తే తెలంగాణ ః నిన్న సాయంత్రం ఇద్దరి వ్యక్తులు ఒకరిపై ఒకరు దూషించుకున్న సంఘటనలో ఇద్దరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని హెడ్ కానిస్టేబుల్ బాలయ్య, రైటర్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మక్తల్ పట్టణం కేశవ్‌నగర్‌కు చెందిన రమేశ్, రెడ్డినగర్ కాలనీకి చెందిన సుధాకర్‌రెడ్డి, శివరెడ్డిలు శనివారం సాయంత్రం ఘర్షణకు గురికావడం జరిగిందని ఇద్దరు అందించిన ఫిర్యాదు మేరకు ఘర్షణకు పాల్పడిన సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నమని పేర్కొన్నారు.

-మరో ఇద్దరిపై కేసు నమోదు....
మక్తల్ మండలం ఎర్సాన్‌పల్లి గ్రామానికి చెందిన నర్సమ్మ, శాంతమ్మలపై దూషణలాడిన సందర్బంలో కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎర్సాన్‌పల్లి గ్రామానికి చెందిన నర్సమ్మ శనివారం అదే గ్రామానికి చెందిన శాంతమ్మ ఇంటి ముందు బహిర్బూహికి వెళ్లగా నిత్యం మా ఇంటికి దగ్గరల్లోనే ఎందుకు వెళ్తున్నమని శాంతమ్మ నర్సమ్మపై దూషించగగా ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో ఇద్దరు మహిళలు పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం జరిగిందని వారి ఫిర్యాదు మేరకు నర్సమ్మ, నర్సమ్మ తమ్ముడు ఎల్లప్ప, శాంతమ్మ, శాంతమ్మ భర్త శ్రీనివాసులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నమని వారు పేర్కొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...