కళాకారుల పనితీరు అద్భుతం


Mon,May 27, 2019 03:11 AM

-చేనేతహస్త కళను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి సాంస్కృతికం : మన దేశంలో అగ్గిపెట్టెలో పట్టే పట్టేంత పట్టు చీరను మలిచిన అద్భుతమైన కళాకారులు ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అ న్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్త కళ ప్రదర్శనను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైన హస్తకళలు, చేనేత వస్ర్తాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మన దేశ సంస్కృతిని కాపాడుతూ వారసత్వ కళలకు జీవం పోయాలని కోరారు. రాష్ట్రంలో కనుమరుగవుతున్న హస్తకళలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటు చేనేత కళాకారులు జీవనోపాధిని పొందుతున్నారని చెప్పారు. చేనేత ప్రదర్శన అధ్యక్షుడు ప్రసాద్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రముఖ స్థానాల్లో విక్రయకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈ నెల 26 నుంచి జూన్ 4వ తేదీ వరకు చేనేత హస్తకళ ప్రదర్శన ఉంటుందన్నారు. పోచంపల్లి బెడ్‌షీట్లు, డ్రస్ మెటీరియల్స్, శారీస్, కళంకారి, ఖాదీ వస్ర్తాలు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, హైదరాబాద్ ఎంబ్రాయిడ్ చీరలు, బంజారా ఉత్పత్తులు, ఆయుర్వేద ఔషధాలు, గద్వాల చీరలు, జైపూర్ వస్ర్తాలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, మైసూర్ రోజ్‌వుడ్ ప్యానల్స్, కాశ్మీర్ శారీస్, ఢిల్లీ, తమిళనాడు రాష్ర్టాల్లోని చేనేత వస్ర్తాలు ఇక్కడ దొరుకుతాయన్నారు. అనంతరం మంత్రిని హస్త కళాకారులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, కౌన్సిలర్ తిరుమల్, గట్టుయాదవ్, శ్రీధర్, నాయకులు లక్ష్మీనారాయణ, హస్త కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...