దైవ చింతన అలవర్చుకోవాలి


Mon,May 27, 2019 03:11 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : దైవ చింతనతోనే ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనిస్తారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆ దివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ గ్రామానికి బొడ్రాయి పెద్ద దిక్కు అని, అంతటి మహోన్నత విగ్రహాన్ని ప్రతిష్ఠించడ సం తోషంగా ఉందన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులు అం దరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయాల అభివృద్ధి కి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. ఆలయాలతోపాటు, మసీదుల, చర్చీలను అన్నివిధాలా అభివృ ద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా రూ పొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నా యకత్వంలో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పరుగులు పెడుతుందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి చ ర్యలు తీసుకుంటున్నామని, అందరూ సన్మార్గంలో ప యనిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూ చించారు. ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, కౌన్సిలర్లు జ్యోతి, వనజ ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...