మార్కెట్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి


Mon,May 27, 2019 03:11 AM

వనపర్తి రూరల్ : జిల్లా కేంద్రం సమీపంలో ని ర్మించనున్న వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నిర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్ రెడ్డి అధికారులకు సూ చించారు. మండలంలో ని చిట్యాల గ్రామ శివారు లో నిర్మిస్తున్న వ్యవసా య మార్కెట్ పనులను ఆదివారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మా ట్లాడుతూ మార్కెట్‌లోని పనులు నాణ్యవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్‌లో కల్పించనున్న వసతులు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలన్నారు. మార్కెట్‌లో అత్యాధునిక వసతులను కల్పించాలని సూచించారు. రైతులు, వ్యాపారుస్తులకు ఇబ్బంది కలగకుండా విశాలమైన ప్రాంగణాలను ఏర్పా టు చేయాలన్నారు. మార్కెట్ మొత్తం 43 ఎకరాల్లో విస్తరించిదని, దానిలో రైతులకు అన్ని వసతులను కల్పించాలన్నారు.

దాదాపుగా 100 దుకాణాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారని, వాటిని వ్యా పారుస్తులకు పారదర్శకంగా లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ చుట్టూ రహదారి వి శాలంగా ఉండేలా ఏర్పాటు చేయాలని, ఇక్కడి ఉన్న చౌడు మట్టిని తొలిగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెయిన్ రోడ్డు నుంచి గోదాం వరకు రో డ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. రైతులు పండించిన ధా న్యాన్ని ఆరబెట్టుకొనేందుకు మార్కెట్‌లో విశాలమైన బె డ్లను నిర్మిస్తున్నామన్నారు. వీటిన్నింటినీ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చిట్యాల సర్పంచ్ భానుప్రకాష్ రావు, మాజీ జెడ్పీటీసీ వెంకట్రావ్, లోక్‌నాథ్ రెడ్డి, వనపర్తి కౌన్సిలర్ వాకిటి శ్రీధర్, నాయకులు విష్ణు, గిరి, ఉస్మాన్, ఉప సర్పంచ్ నర్సింహ తదితరులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...