రంజాన్ కానుకలు సిద్ధం


Sun,May 26, 2019 03:18 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : అన్ని మతాల పండుగలకు ప్రత్యేక ప్రాధానత్యను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అందులో భాగంగానే రంజాన్ పండుగ సందర్బంగా పేద ముస్లింలకు ప్రత్యేక బహుమతులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. పేద ముస్లింలకు అందించాల్సిన దుస్తులు వారం రోజుల కిందట జిల్లా మైనార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గిఫ్ట్ ప్యాకుల పంపిణీ కార్యక్రమం కాస్త ఆలస్యమైనా త్వరలోనే ఒక రోజును నిర్ణయించి పంపిణీ చేయడానికి అధికారులు తగిన చర్యలను తీసుకుంటున్నారు. జిల్లాలోని వనపర్తి నియోజకవర్గానికి 2వేల గిఫ్ట్ ప్యాకులతో పాటు, ప్రభుత్వం తరుపున ముస్లిం సోదరలందరికి ఇచ్చే ఇఫ్తార్ విందు కోసం రూ.4లక్షలు మంజూరైనట్లు జిల్లా మైనార్టీ శాఖ అధికారి టి.సామ్యూల్‌జాకబ్ తెలిపారు.

గిఫ్ట్ ప్యాకెట్‌లో ఉండే వస్తువులు..

పేద ముస్లింలు సైతం రంజాన్ పండుగకు కొత్త దుస్తులు ధరించి ఆనందంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేస్తుంది. ఈ గిఫ్ట్ ప్యాకులో చీర, జాకెట్, ప్యాంట్, షర్ట్, కూతురికి ప్యాంటు, చున్ని, స్కర్టు ఉంటాయని అధికారులు వెల్లడించారు.

పేద ముస్లింలను గుర్తించడం ఇలా..

నియోజక వర్గంలో పేద ముస్లింలను ఆయా గ్రామాలలో, పట్టణాలలో, వార్డులలో ఉన్న మసీద్‌లలో గల మజీద్ కమిటీ బృందం నిరుపేద ముస్లింలను గుర్తించడం జరుగుతుంది. వారికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా మైనార్టీ కార్యాలయానికి అందజేస్తారు. మసీద్ కమిటీలు ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ప్యాకులను పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన గిఫ్ట్ ప్యాకులను జిల్లా మైనార్టీ అధికారులు ఆయా మసీద్ కమిటీలకు పంపించిన తర్వాత మజీద్ కమిటీ సభ్యులు పేద ముస్లింలకు పంపిణీ కార్యక్రమంను నిర్వహిస్తారు.

వివాహ వేడుకల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి

గోపాల్‌పేట : మండలంలోని జింకలబీడు తండాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు రాత్లావత్ సూర్యానాయక్ వివాహం శనివారం నిర్మలతో జరిగింది. ఈ వివాహ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై నూతన వధూవరుల ను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ జానకిరాంరెడ్డి, రై తు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ తిరుపతి యాదవ్, సర్పంచ్ శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...