భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి


Sun,May 26, 2019 03:16 AM

-పది రోజుల్లో రైతుల ఖాతాలను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి
-గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కరించండి
-రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో జేసీ వేణుగోపాల్
కొత్తకోట : రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పది రోజుల్లో రైతుల ఖాతాలను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పార్ట్-బీ భూములు, విరాసత్, పాస్‌బుక్‌లపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌యూపీ ల్యాండ్ రికార్డ్స్‌ను గ్రా మాలవారీగా తహసీల్దార్ శంకర్ జేసీకి వివరించారు. ఎల్‌ఆర్‌యూపీ మీద సూచనలు ఇ స్తూ పది రోజుల్లో అన్ని ఖాతాలను ధరణి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా భూ సమస్యలు ఉన్న గ్రామంలో రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రె వెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్, గిర్దావర్లు ఆసీఫ్, రాఘవేందర్‌రెడ్డి, వీఆర్‌వోలు బందెన్న, శ్రీరాములు, పెంటన్న, రాఘవేందర్, శాంతన్న, కొండన్న, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...