ఉద్యోగ భద్రత కల్పించాలి


Sun,May 26, 2019 03:15 AM

వనపర్తి క్రీడలు : స్కీం వర్కర్స్, ఇతర ఉద్యోగులపై ఉన్నత అధికారుల వేధింపుల నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షుడు వై.వెంకటయ్య అన్నారు. శనివారం వనపర్తి మండల కార్యాల యం ముందు ధర్నా చేసి మండల అధికారికి అంగన్‌వాడీ, ఆశకార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వివిధ ఉద్యోగులలో పనిచేస్తున్న కార్యకర్తలకు పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారన్నారు. ఈ నెల 15న షాకాస్ నోటీసులుచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏ ఎన్‌ఎంఎస్‌లు ఉషారాణి, భాగ్యలక్ష్మి, రాములు, రాజశేఖర్‌రెడ్డి, లలిత, గీతాదేవి, పద్మ, సునిత, రాజారాంప్రకాష్ పాల్గొన్నారు.

-పెబ్బేరులో..
పెబ్బేరు : అదనపు విధులు నిర్వహిస్తూ నెలలు తరబడి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, స్కీంవర్కర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్‌వాడీ, ఆశ, ఆరో గ్య కార్యకర్తలు కోరుతు శనివారం తహసీల్దార్ సునితకు వినతి పత్రాన్ని అందజేశారు. అరకొర వేతనాలు సరైన సమయానికి అందక మరోపక్క పనిభారం పెరగడంతోపాటు మానసిక ఒత్తిడికి గురవుతున్నామని అవేదన వ్య క్తం చేశారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల అంగన్‌వాడీ, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

-పెద్దమందడిలో..
పెద్దమందడి : స్కీంవర్కర్లు, ఇతర ఉద్యోగులపై వేధింపులు ఆపి, ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...