కీటక వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Sun,May 26, 2019 03:15 AM

వనపర్తి వైద్యం : జిల్లాలో ఉన్న ప్రజలందరూ కీటకాల వ్యాధులపై చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి వైద్యారోగ్య అధికారి డా. రవిశంకర్ అన్నారు. శనివారం కీటక జనిత వ్యాధులపై మదనాపురం, ఘనపురం గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు జిల్లా ఆరోగ్యాధికారి కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో డా. రవిశంకర్ మాట్లాడుతూ దోమలు కుట్టట వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధులను కీటక జనిత వ్యాధులని పిలుస్తారన్నారు. ఈ దోమలలో నాలుగు రకాల దోమలు కుట్టుట వల్ల చికున్ గున్యా, మొదడు వాపు, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, కాలాహజ్జార్ తదితర వ్యాధులు వ్యాపిస్తాయని ఆయన సూచించారు. ఆశకార్యకర్తలు జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ప్రతి ఆశ కార్యకర్త పరిధిలోని ప్రజలకు కీటక వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డా.ఇస్మాయిల్, సబ్‌యూనిట్ అధికారి శ్రీనివాస్‌జీ, డీపీవో బిక్షపతి, మద్దిలేటి, బాలస్వామి, శ్రీనివాసులు, ఆశకార్యకర్తులు తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...