పేదల పాలిట ఓ వరం.. జకాత్


Sun,May 26, 2019 03:15 AM

-సంపాందించిన దానిలో 40 శాతం పేదలకు
- మహ్మద్ ప్రవక్త నుంచే జకాత్ పద్ధతి
వనపర్తి, నమస్తే తెలంగాణ : రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారు పేరు. ఇస్లాం మూల సిద్ధాంతాల్లో జకాత్ కూడా ఒకటి. జకాత్ అని పేరు వింటేనే యాచకులు, గరీబులకు ఎక్కడ లేని ఆనందాలకు అవుధులుండవు. ఉన్నత స్థాయికి చేరుకున్న ముస్లింలు తము సంపాందించిన దానిలో 40 శాతం పేదలకు జకాత్‌గా చెల్లించడం జరుగుతుంది. అది కూడా డబ్బు ఎవరికి అవసరం ఉందో వారికి ఎలాంటి లాభపేక్ష లేకుండా ఆదుకోవడమే. ఈ పద్ధతి మహ్మద్ ప్రవక్త కాలం నుంచే కొనసాగుతుందని, జకాత్ ఫిత్రాల వల్ల పుణ్యం లభిస్తుందని ముస్లిం మత పెద్దలు వివరిస్తున్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథం కూడా పలుమార్లు ఈ విషయాన్ని ప్రభోదించింది. మనుషుల్లోని పేద, ధనిక అసమానతలను పొగొట్టడానికి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు, కృతజ్ఞతభావం పెరగడానికి ఇవి ఎంతో గానో ఉపయోగపడుతాయి. పేదలకు దానం చేయడం వల్ల వారు కూడా ఈ మాసాన్ని సంతోషంగా నిర్వహించే అవకాశం ఉంది . జకాత్ ప్రధానంగా పేదవారైనా తమ బంధువులకు ఇస్తారు. అనాథలకు, వితంతువులు, వికలాంగులు, కడు పేదవారలకు కూడా ఇస్తారు.

-సేవా నిరతితో..
ఇస్లాం మతంలో జకాత్ డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంత మంది డబ్బున్నవారు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచిత వివాహలు, దుస్తులతో పాటు పేదలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. రంజాన్ మాసంలో జకాత్‌తో పాటు ఫిత్రాను విధిగా చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబం యోగ క్షేమం కోసం ప్రతి వ్యక్తి పేరు మీద కిలో 250 గ్రాముల గోధుమలు లేదా దానికి సమాన విలువ గల నగదును ఫిత్రాగా పేదలకు పంచుతారు. ఇవన్నీ రంజాన్ ముగింపు సందర్బంగా జరుపుకునే ఈదుల్ ఫితర్ నమాజు కంటే ముందుగానే చెల్లించడం ఆనవాయితి.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...