నేటి తరానికి స్ఫూర్తి రవీంద్రుని గీతాంజలి


Sun,May 26, 2019 03:14 AM

- రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ బాద్మీ శివకుమార్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రపంచం గర్వించదగ్గ రచయిత నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి రచనను నేటి తరానికి అర్థమయ్యే విధంగా జిల్లా కవి రామచందర్‌జీ రావు తెలుగులో అనువాదం చేయడం అభినందనీయమని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సమావేశ మందిరంలో జరిగిన రవీంద్ర గీతాంజలి పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య రంగానికి గొప్ప ఆదరణ లభించిందని ఆయన పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సాహిత్య అభిమాని కావడం వల్ల ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఘనంగా నిర్వహించి ఎందరో సాహితీ వేత్తలను ప్రోత్సహించారన్నారు. సాహితీ జిల్లాగా సంస్థానాల ఖిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాలో సాహిత్యం వెల్లవిరిసిందని, ఆ స్ఫూర్తిని నేటి తరం కవులు కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రవీంద్రుని గీతాంజలి రామచందర్‌జీరావు నేటి తరానికి అర్థమయ్యే విధంగా తెలుగులోకి అనువాదం చేయడం ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో సంగీత నాటక అకాడమీని ఏర్పాటుచేసి ఎంతో మంది కవులును , కళాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు.

గీతాంజలి రచన మానవీయ సంబంధాలను ప్రకృతి అనుబంధాలను తెలియజేస్తూ రాసిన గొప్ప రచన అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మాజీ శాసన సభురాలు రచయిత్రి స్వర్ణ సుధాకర్‌రెడ్డి తెలంగాణ సా సాహిత్య రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఎంతో మంది కవులు, కళాకారులు, రాష్ర్టానికి పేరు తెచ్చి పెట్టారని ఆమె కొనియాడారు. గీతాంజలి తెలుగు అనువాదం ద్వారా పాలమూరు సాహితీ రంగానికి మరో మారు గుర్తింపు లభించిందని ఆమె అన్నారు.సభకు అధ్యక్షత వహించిన ఆచార్య ఎస్వీ రామారావు మాట్లాడుతూ సంస్థానాల కాలం నుంచి జిల్లాలో సాహిత్యం వెల్లివిరిసిందని స్పూర్తిని నేటి తరం కవులు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా స్వరలహరి కల్చలర్ అకాడమీ అధ్యక్షులు నాయని భాగన్నగౌడ్ ప్రముఖ రచయిత కమలాకర్ డాగోజీరావు పాల్గొన్నారు. అధ్యాపకులు రచయిత లక్ష్మణ్‌గౌడ్ గ్రంథ సమీక్ష చేశారు. హెచ్. రమేష్బాబు రచయితను పరిచయం చేయగా పాలమూరు కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు గుముడులా చక్రవర్తిగౌడ్, ప్రసాదరావు సభను సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రచయితను పలు సంస్థలు ఘనంగా సన్మానించాయి

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...