బాల్య వివాహాన్ని నిలిపివేసిన అధికారులు


Sun,May 26, 2019 03:14 AM

కోడేరు; మైనర్ బాలికకు వివాహం చేస్తుండటంతో విషయం తెలసుకున్న అధికారులు శనివారం బాల్య వివాహాన్ని నిలిపి వేసిన సంఘటన మండల కేంద్రమైన కోడేరులో జరిగింది. కోడేరు ఎస్‌ఐ తహశీల్దార్ సుందర్‌రాజులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోడేరు మండల కేంద్రానికి చెందిన కుందేళ్ల సునిత అనే మైనర్ బాలికను ఇదే గ్రామానికి చెందిన పిల్లి రమేష్ అనే బాలునికి ఇచ్చి ఈనెల 26న వివాహం చేయటానికి ఇరువురు కుటుంబీకులు నిర్ణయించారు.ఈవిషయం తెలసుకున్న కోడేరు ఎస్‌ఐ పోచయ్య, తహశీల్దార్‌సుందర్‌రాజు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శోబారాణిలు శనివారం వధువు సునిత ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడారు. అయితే వధువు వరుడు ఇద్దరు మైనర్లు కావటంతో వివాహం చేయవద్దని ఇరు కుటుంబీకులకు కౌన్సిలంగ్ ఇచ్చి మేజర్లు అయ్యే వరకు వివాహం చేయవద్దని సూచించారు. స్థానిక సర్పంచు వెంకటస్వామి, ఇతర పెద్దల సమక్షంలో ఇప్పట్లో వివాహం చేయమని ఇరు కుటుంబీకులతో రాతపూర్వకంగా రాయించుకున్నారు. దీంతో మైనర్ బాలిక వివాహం ఆగి పోయింది.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...