ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య


Sun,May 26, 2019 03:14 AM

అచ్చంపేట రూరల్‌ః ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై పరశురాం వివరాల ప్రకారం ఉప్పునుంతల మండలం తాడురు కు చెందిన లక్ష్మమ్మ తో పట్టణంలోని గోకుల్‌నగర్ కు చెందిన వాయిళ్ళ ఆంజనేయులు (23) కు ఏడాది క్రితం వివాహాం జరిగింది. ఏడాది పాటు అన్యోన్యంగా కొనసాగిన వారి దాంపత్య జీవితంలో లక్ష్మమ్మ గత రెండు రోజుల క్రితం (24న) పండంటి ఆడ శిశువు కు జన్మనిచ్చింది. మొదటి సంతానం లోనే ఆడపిల్ల పుట్టిందని తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రి ఆంజనేయులు శుక్రవారం రాత్రి 10 గంటల కు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ముందే కొంత అప్పు ఉంది ఆడపిల్ల పుడితే మరింత భారమే కధా అని భావించి చెక్‌పోస్టు సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. శనివారం తెల్లవారుజామున విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శవాన్ని కిందకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి తులిశయ్య పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని, శవానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...