విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనే!


Sat,May 25, 2019 03:00 AM

వీపనగండ్ల : మండలకేంద్రంలోని పీహెచ్‌సీతో పా టు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో విధులు నిర్వహిం చే వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకుంటే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ శ్వేతామొహంతి హెచ్చరించారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ ఆకస్మికం గా తనిఖీ చేశారు. దవాఖానలో నిల్వచేసిన మందుల ను పరిశీలించారు. దవాఖానలో సరిపడా మెటీరియల్, వసతులు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎన్‌ఎంలతో ఏర్పాటు చేసిన ఇమ్యూనైజేషన్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సంబంధించిన నెలవారీ రిపోర్టులను పరిశీలించారు. ప్రభు త్వం గర్భిణులు, బాలింతలపై వైద్య పరంగా ప్రధానం గా దృష్టి సారించినప్పటికీ క్షేత్రస్థాయిలో మండల వైద్య సిబ్బంది పనితీరు సక్రమంగా లేకపోవడంతో కాన్పుల కోసం ప్రైవేట్ దవాఖానలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ దవాఖానలో నమోదు చేసిన కాన్పుల వివరాలు తెలుసుకొని స్థానిక వైద్య సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి సబ్‌సెంటర్‌లో ఒక్కొక్క నెల చొప్పున నమోదు చేసిన కాన్పుల సంఖ్య ను పరిశీలిస్తుంటే.. ఏఎన్‌ఎంలు జీతాలపై మాత్రమే శ్రద్ధను కనపరచి విధుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినట్లు అర్థమవుతుందన్నారు. ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లను చైతన్యపరచి మెరుగైన సేవలందించాలని మండల వైద్యాధికారి షబాన తస్లీంను హెచ్చరించారు. మళ్లీ స మీక్ష సమావేశం వరకు పనితీరు మెరుగుపరుకోకపోతే సస్పెండ్ చేస్తామని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులను త్వర గా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని రెవెన్యూ కా ర్యాలయ భవన నిర్మాణం, 30 పడకల దవాఖాన ప్రా రంభోత్సవం, అంబులెన్స్ సౌకర్యం, ఎస్సీ గురుకుల పాఠశాలకు శాశ్వత భవనం మంజూరు, శ్మశాన వాటికకు భూ కేటాయింపు, ఆర్టీసీ బస్టాండ్ వినియోగం తదితర సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ శ్వేతా మొహంతికి సర్పంచ్ నరసింహారెడ్డి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ మాసంద మగ్ధాలిన్ పెర్టిన్, జిల్లా వైద్యారోగ్య శాఖ ఇన్‌చార్జి రవిశంకర్, మండల వైద్యాధికారి షబాన తస్లీం, టీబీ నోడల్ ఆఫీసర్ జోషి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...