లెక్క తేలింది


Sat,May 25, 2019 02:59 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో చేపట్టిన పశుగణన సర్వే కొలిక్కి వచ్చింది. గతం లో 2011 పశుగణన జరుగగా, మళ్లీ ఇప్పుడు పశు గణన కొనసాగింది. దాదాపు ఏడు ఏళ్ల తర్వాత జరిగిన గణనతో పశుసంవర్ధక శాఖ వా టికి అనుగుణంగా వసతుల సమకూర్పునకు మార్గం సుగమమవుతుంది. ఈ గణన ప్రకారమే అన్ని రకాల జంతువులకు మందులతో పాటు ఎక్కడెక్కడ వెటర్నరీ దవాఖానలు ఏర్పాటు చేయాలన్న స్పష్టత కూడా ఈ గణన ద్వారా వెల్లడవుతుంది. అయితే, ఏడేళ్లలో చూస్తే అన్ని ఇతర జంతువులతో పోల్చితే.. పశువుల(ఆవులు-ఎద్దు లు) సంఖ్య మాత్రం జిల్లాలో దాదాపు 10 వేల వరకు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.

తగ్గిన పశువులు
2011 గణనతో పోలిస్తే జిల్లాలో గతంలో కంటే ప్రస్తుతం 10463 పశువులు తగ్గాయి. కాగా, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు మాత్రం పెరిగాయి. మూడు దశాబ్దాలు గా తెలంగాణలో సేద్యం పడకేసింది. సమైక్య పాలనలో సేద్యాన్ని నాటి పాలకులు నిర్వీర్యం చేశారు. దీంతో గ్రామాల్లో ఉండే రైతులంతా పట్నం బాట పట్టడంతో పశువుల సం ఖ్య తగ్గడానికి కారణంగా నిలుస్తుంది. కొత్త రాష్ట్రం లో ఇప్పుడిప్పుడే మళ్లి పట్నం నుంచి రైతులు గ్రామాలకు వెళ్లి సేద్యం మొదలు పెడుతున్న క్రమంలో పశువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులను ప్రోత్సహిస్తూ గేదెలు, గొర్రెల పంపిణీలు విరివిగా చేపట్టడంతో ఈ సం పద పెరుగుతూ వస్తుంది. ఒక్క గేదెల పరంగా చూస్తే.. 8435 గతంలోకంటే పెరుగుదల కనిపిస్తుంది. అలాగే గొర్రెల వారీగా చూస్తే.. ఘణనీయమైన మార్పు కనిపిస్తుంది. దాదాపు రెండున్నర లక్షల గొర్రెల సంపద పెరిగిన అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే, వ్యవసాయ పనుల కో సం గ్రామాల్లో ఎక్కువగా ట్రాక్టర్లనే ఉపయోగిస్తున్నారు. దీంతో ఎద్దుల పోషణ గణనీయంగా తగ్గింది. మారుమూల ప్రాంతాల్లో మాత్రమే ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నారు. ఇక ప్రభు త్వం సబ్సిడీపై గేదెలు, గొర్రెలు ఇస్తుండటంతో వీటి సంఖ్య గతంతో పోలిస్తే బాగా పెరిగింది.

గణన చేశారిలా..
డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్‌మ్యాటిక్స్ సెంటర్(ఎన్‌ఐఎసీ) దేశ వ్యాప్తంగా జంతుగణన చేయిస్తుంది. ఐదేళ్లకోసారి గణన చేసే విధంగా ఈ సంస్థ పని చేస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ సెంటర్ ఆధ్వర్యంలో 20వ జంతు గణన చేపట్టారు. ఇందుకోసం జిల్లాలోని 14 మండలాల నుంచి 15 మంది సూపర్ వైజర్లు, 40 మంది ఎన్యూమరేటర్లు దాదాపు ఎనిమిది నెలలపాటు జంతు గణన చేశారు. పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులు ఈ సర్వేను పర్యవేక్షించారు. ఈ నెల చివరి వరకు ఈ గణను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 20 లైవ్ స్టాక్ సెన్‌సెస్ వెబ్‌సైట్‌లో జిల్లా అధికారులు నిక్షిప్తం చేసే పనుల్లో ఉన్నారు. ఇది పూర్తి చేస్తే పూర్తిస్థాయిలో జిల్లా పశుగణన లెక్కలు వెల్లడవుతాయి.

ప్రయోజనాలు ఇవీ..
మైదాన ప్రాంతంలోని జంతు గణనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక స్పష్టత వస్తుంది. పశువులకు ఎంత దాణా కావాలి.. ఏ జంతువులకు ఏ జబ్బుకు ఎంతమేర మందుల తయారీ కావాలి. వెటర్నరీ దవాఖానలు ఏర్పాటు చేయాల్సిన డిమాండ్ ఎంత ఉందనే వివరాలు తెలుస్తాయి. అలాగే మేకలు, గొర్రెలతో రాష్ర్టాల వారీగా ఎంత మాంసం ఉత్పత్తి అవుతుంది. గేదెలతో ఎన్ని లీటర్ల పాలు ఏడాదికి వస్తాయో ఓ అంచనా వస్తుంది. ఈ జంతుగణన ప్రకారమే రాష్ర్టాలకు, కేంద్రం పశుసంవర్ధక శాఖకు సంబంధించి సబ్సిడీలు ఇస్తుంది. అలాగే ఈ గణన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పశుసంవర్ధకశాఖ పరంగా వివిధ పథకాలను అమలు చేస్తువస్తున్నాయి.

వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం..
జిల్లా వ్యాప్తంగా పశుగణన పూర్తి చేశాం. జిల్లాలోని పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల ద్వారా ఈ సర్వే నిర్వహించాం. ఈ సర్వే ద్వారా గతంలో ఉన్న వివరాలు.. ప్రస్తుత వివరాల ఆధారంగా పశుగణన పూర్తిస్థాయిలో తెలిసి పోతుంది. వీటిని బట్టి తీసుకోవాల్సిన చర్యలు.. ఇతరత్రా ఏర్పాట్లు.. మందుల కేటాయింపులులాంటివన్ని సులభతరంగా ఉంటాయి. ప్రస్తుతం సేకరించిన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
- డాక్టర్ హరికృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి అధికారి, వనపర్తి

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...