కీటక జనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Sat,May 25, 2019 02:59 AM

వనపర్తి వైద్యం : జిల్లాలో ఉన్న ప్రజలందరూ కీటక జనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉం డాలని జిల్లా ఇన్‌చార్జి వైద్యారోగ్య అధికారి డాక్టర్ రవిశంకర్ అన్నారు. శుక్రవారం కీటక జనిత వ్యాధులపై పెద్దమందడి, ఖిల్లాఘణపురం మండలంలోని కమాలొద్దీన్‌పూర్ గ్రామాల్లోని ఆశకార్యకర్తలకు జిల్లా ఆరోగ్యాధికారి కార్యాలయంలో ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ దోమల ద్వారా చికున్‌గున్యా, మెదడు వాపు, మలేరి యా, డెంగీ, ఫైలేరియా, కాలాహజ్జార్ తదితర వ్యాధులు వ్యాపిస్తాయని సూచించారు. ఆశకార్యకర్తలు జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఆశకార్యకర్త దన పరిధిలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఇస్మాయిల్, సబ్‌యూనిట్ అధికారి శ్రీనివాస్‌జీ, డీపీవో భిక్షపతి, మద్దిలేటి, బాలస్వామి, శ్రీనివాసులు, ఆశకార్యకర్తులు తదితరులు ఉన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...