కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి..


Sat,May 25, 2019 02:59 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : 2019-20 విద్యాసంవత్సరానికి గాను కార్పొరేట్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వెంకటస్వామి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో 7 పాయింట్ల పైన జీపీఏ సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో (epass.cgg.gov.in) ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను జూన్ 13వ తేదీన వారి మొబైల్ నెంబర్‌కు తెలియజేస్తామన్నారు. ఎంపికైన విద్యార్థులు జూన్ 14 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తు (హార్డ్ కాపీ)తో పాటు, ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ మెమో, కులము, ఆదాయం, స్థానిక ధ్రువపత్రం, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, సంబంధిత బోనఫైడ్, సంక్షేమ హాస్టల్ బోనఫైడ్ (ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులైతే), ఒక జత జీరాక్స్ కాపీలతో సంబంధిత కార్యాలయములో సమర్పించి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలని పేర్కొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...