భూరికార్డులు పెండింగ్‌లో ఉండరాదు


Sat,May 25, 2019 02:59 AM

-జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్
వీపనగండ్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఎటువంటి ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా నిరంతరం కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూ ప్రక్షాళన రికార్డులను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను సమన్వయపరచి ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కొన్ని గ్రామాల్లో రైతుల సమన్వయ లోపంతో రికార్డు, శిస్తుపరంగా తేడాలు ఉండడంతో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాతే పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు సమన్వయంతో కలిసి వచ్చి అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...