కొండను తవ్వి.. ఎలుకను పట్టి


Sat,May 25, 2019 02:58 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని పా తబస్టాండ్‌కు ఆనుకుని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 11 షాపులు, ఇందిరాపార్కు ముందు 38 దుకాణాలను నిర్మించారు. నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా షె డ్యూల్ కులాల వారీగా కేటాయించారు. అయితే, షా పింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించిన అగ్రిమెంట్లు మున్సిపాలిటీ వద్ద లేకపోవడంతో నివేదిక ఇవ్వాలని గతంలో కౌన్సిల్ సభ్యులలోని ఐదుగురిని ఒక కమిటీగా ఏర్పా టు చేశారు. నిజనిర్ధారణ చేయడంలో కమిటీ పూర్తిగా విఫలమైంది. అగ్రిమెంట్ లేని దుకాణాల యజమానులకు రెన్యూవల్ చేయించుకోవాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అగ్రిమెంట్లు లేని కారణంగా చాలా కాలంగా ఉన్న యజమానుల పేరిట కిరాయిని వసూళ్లు చేస్తున్నారు. అసలుదారులు తమ దుకాణాలను కిరాయిలకు ఇచ్చుకుని మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని ఈ నెల 8వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో లింగారెడ్డి కుంట.. బినామీల పంట.. పే రుతో కథనం ప్రచురితమైంది. వార్త ప్రచురణ నాటి నుంచి నేటి వరకు క్షేత్ర స్థాయిలో విశ్లేషణ చేస్తున్నామం టూ సంబంధిత అధికారులు చెబుతూ, తూతూ మం త్రంగా నోటీసులు జారీ చేశారు. వాటిని కూడా అటెండర్‌తో దుకాణాల యజమానులకు పంపించి చేతులు దులుపుకున్నారు. కొత్తకోట రోడ్ పాత బస్టాండ్ ప్రాం తంలో ఉన్న 11 దుకాణ సముదాయాలకు సంబంధించి 2016 నుంచి నేటి వరకు రూ.9,05,121 పెం డింగ్‌లో ఉన్నాయి. వార్త ప్రచురితమైన నాటి నుంచి 16 రోజులుగా మున్సిపల్ రెవెన్యూ మేనేజర్, బిల్ కలెక్టర్లు హడావిడి చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్న వారికే నోటీసులు జారీ చేయడం విశేషం. పాత బకాయిలు చెల్లించాలని, రెన్యువల్ చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు.
అటెండర్‌తో నోటీసులు పంపిణీ..
మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ స్థాయిలో అ వినీతి జరిగిందని విమర్శలు చాలానే ఉన్నాయి. అ లాంటి షాపింగ్ కాంప్లెక్స్ అగ్రిమెంట్లు, అవినీతి, అస లు యజమానులు, బినామీ దారుల గురించి క్షేత్ర స్థా యిలో పరిశీలన లేకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్నవారందరూ అసలు యజమానులే అంటూ అటెండర్ తో రెవెన్యూ మేనేజర్ నోటీసులు పంపిణీ చేయడం ప లు అనుమానాలకు దారి తీస్తున్నదని విమర్శిస్తున్నారు.
అందరూ అసలు యజమానులే..
పట్టణంలోని కొత్తకోట రోడ్ పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న 11 దుకాణ సముదాయాల్లో ఉన్న వారందరూ అసలు యజమాను లే. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పెండింగ్ కిరాయిలను చెల్లించాల ని, రెన్యూవల్ చేయించుకోవాలని నోటీసులు జారీ చేశాం. లింగిరెడ్డి కుంటకు సంబంధించిన షాపులకు నోటీసులను సిద్ధం చేస్తున్నాం.
- నరేష్ రెడ్డి, మున్సిపల్ రెవెన్యూ మేనేజర్

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...