సాగునీరు వచ్చాకే పనులు చేపట్టాలి


Thu,May 23, 2019 02:11 AM

ఖిల్లాఘణపురం: మండలంలోని మానాజీపేట గ్రామానికి సాగునీరు తీసుకొచ్చాకే మామిడిమాడ నేరేడు చెరువు వద్ద జరుగుతున్న పనులు కొనసాగించాలని మానాజీపేట సర్పంచ్ సతీష్ ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు బుధవారం పనులను అడ్డగించారు. సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ గ్రామ కేఎల్‌ఐ ఎత్తిపోతల ద్వారా ఘణపురం బ్రాంచ్ కెనాల్ నుంచి వస్తున్న సాగునీటితో మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు పుష్కలంగా సాగునీరు వచ్చి చేరాయని అన్నారు. దీంతో ఆయా గ్రామాల రైతులు పంటలు సాగు చేశారని, మా గ్రామానికి చుక్కనీరు రాక వ్యవసాయం చేసుకునేది ఎలాగని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వానాకాలంలో కూడా మా గ్రామానికి సంబంధించిన కాల్వ పనులు పూర్తికాకపోతే సాగునీరు రావని అన్నారు. అందుకు తమ గ్రామానికి సాగునీరు తీసుకురావాలని ఎన్నిసార్లు అధికారులు, కాంట్రాక్టర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు బుధవారం మామిడిమాడ నేరేడు చెరువు వద్ద జరుగుతున్న కాల్వ పనులను అడ్డగించామని గ్రామస్తులు తెలిపారు. దీంతో చేసేది ఏమి లేక అక్కడి సిబ్బంది పనులను నిలిపివేశారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు చొరవ తీసుకొని మా గ్రామానికి సాగునీరు అందించి రైతుల కళ్లలో ఆనందం నింపాలని కోరారు. కార్యక్రమంలో మానాజీపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...