ఫలితాలను జాగ్రత్తగా క్రోడీకరణ చేయాలి


Thu,May 23, 2019 02:11 AM

నాగర్‌కర్నూల్ రూరల్: ఓట్ల లెక్కింపు క్రోడీకరణలో జాగ్రత్తగా వ్యవహరించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీధర్ అన్నారు. సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సువిధ అప్లికేషన్ల్ నమోదు చేసే ఆపరేటర్లు, ఈవీఎం గోదాంల ఇన్‌చార్జి, కౌంటింగ్ ఇన్‌చార్జిలు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల అనుమతి తర్వాతనే రౌండ్ల వారీగా ఫలితాలను విడుదల చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో ఫలితాలతో పాటుగా 17సీ ప్రొఫార్మాను స్కాన్ చేసి నమోదు చేయాలన్నారు. సువిధ అప్లికేషన్‌లో ఓట్ల లెక్కింపు ఫలితాల నమోదు చేసే అధికారులు అబ్జర్వర్, రిటర్నింగ్ అధికారుల అనుమతి పొంది ఆన్‌లైన్లో నమోదు చేయాలన్నారు. ఏ ఒక్క ఉద్యోగి అలసత్వం ప్రదర్శించకుండా సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుని ఎన్నికల ఫలితాలను విదలలో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో గద్వాల కలెక్టర్ శశాంక్, మూడు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...